
మొక్కలను సంరక్షించాలి
అర్వపల్లి: వన మహోత్సవంలో భాగంగా నాటే మొక్కలను సంరక్షించాలని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి శ్రీనివాస్ కోరారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అర్వపల్లి శివారులోని దర్గా సమీపంలో 2,500 మొక్కలు నాటించే పనులను బుధవారం ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 7,500మొక్కలు పెంచనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి, టీఏ దీపిక, పంచాయతీ కార్యదర్శి నవీన్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.