
సమస్యలను ఎదుర్కొని నిలబడాలి
చివ్వెంల(సూర్యాపేట) : జీవితంలో సమస్యలను ఎదుర్కొని నిలబడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనిషి పుట్టినపప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటాడని, వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసి ఉండాలన్నారు. చిన్న విషయాలకు ఆత్మహత్యల వరకు వెళ్లి నిండు ప్రాణాలను తీసుకోవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపల్ శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి, న్యాయవాదులు గుంటూరు మధు, కాసం సరిత, కట్ట సుధాకర్, జుస్మిత, అనంతుల సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి ఫర్హీన్ కౌసర్