
పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్‌టీ బృందం సర్వే
సూర్యాపేట : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలవుతున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్) ప్రోగ్రాంపై పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి ఎన్‌సీఈఆర్‌టీ బృందం బుధవారం సర్వే చేసింది. జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడ ప్రాథమిక పాఠశాల, రాజీవ్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో జరుగుతున్న బోధన – అభ్యసన ప్రక్రియను పరిశీలించడమే కాకుండా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడింది. ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం అమలు విధానం, విద్యార్థుల ప్రాథమిక పఠన–గణన నైపుణ్యాలు – స్థాయి అంచనా, ఉపాధ్యాయుల అనుభవాలు – బోధనలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార సూచనలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం – పిల్లల విద్యలో వారి పాత్ర, టీఎల్‌ఎం వినియోగం సంబంధిత రికార్డుల తనిఖీ చేసింది. తనిఖీల్లో అకడమిక్ కన్సల్‌ల్టెంట్లు భావన మలోత్రా, డాక్ర్ ప్రంజలి దేవ్, ఎస్‌ఈఆర్‌టీ ప్రతినిధి జె.శ్రీనివాసులు, సూర్యాపేట ఎంఈఓ శేషగాని శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్‌ఎంలు యాకయ్య, పద్మ, రీసోర్స్ పర్సన్ నరసింహారావు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.