
తిండీ తిప్పలు మాని పడిగాపులు
అర్వపల్లి: యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. తిండీతిప్పలు మాని తెల్లవారు జామునుంచే పీఏసీఎస్‌లు, మన గ్రోమోర్ బాట పడుతున్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్‌కార్డులు, వీటి జిరాక్స్ కాపీలు, చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురుచూస్తున్నారు. పొద్దస్తమానం నిరీక్షించినా అందరికీ యూరియా దొరకని దుస్థితి నెలకొంది. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని పీఏసీఎస్‌కు యూరియా వస్తుందని తెలిసి వివిధ గ్రామాల రైతులు మంగళవారం ఉదయం నుంచే కేంద్రానికి చేరుకున్నారు. రాత్రి అయ్యాక 250 బస్తాల యూరియా రాగా క్యూలైన్ కట్టారు. సూర్యాపేట–జనగామ 365బీ హైవే వెంటే పీఏసీఎస్ కార్యాలయం ఉండటంతో రహదారిపైనే యూరియా కోసం బారులుదీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేచిఉన్నా కొందరికే దొరకడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్‌లో ముందు వరుసలో ఉన్నవారికి ఒకరికి ఒక బస్తా చొప్పున మాత్రమే ఇచ్చారు. స్థానిక ఏఎస్‌ఐ రామకోటి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
చిలుకూరు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు క్యూలో పెట్టిన చెప్పులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు
ఫ యూరియా కోసం రైతుల అరిగోస
ఫ వేకువజాము నుంచే పీఏసీఎస్‌లు, మన గ్రోమోర్ కేంద్రాల వద్ద బారులు
ఫ అయినా అందరికీ అందని యూరియా బస్తా