
రైతులు 600 మంది.. బస్తాలు 400
మోతె: మోతె మండల కేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా ఇస్తున్నారని సమాచారం తెలుసుకున్న స్థానిక మండల రైతులతో పాటు చివ్వెంల, మునగాల మండలాల నుంచి సుమారు 600 మంది తరలివచ్చి క్యూ లైన్‌లో నిల్చున్నారు. 400 యూరియా బస్తాలు రాగా ఒక్కో రైతుకు ఒకబస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని మిగతా రైతులు వెనుదిరిగి పోయారు.
ఉదయం నుంచి ఎదురుచూసినా యూరియా రాక..
యూరియా లోడు వస్తుందని సమాచార తెలుసుకొని మామిళ్లగూడెం పీఏసీఎస్ వద్దకు మంగళవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా యూరియా లారీ రాకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.