
తెరుచుకున్న మట్టపల్లి ఆలయం
న్యూస్‌రీల్
క్రీడాపోటీలు ప్రారంభం
ఎంజీ యూనివర్సిటీలో అంతర్ కళాశాలల క్రీడాపోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి.
మంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
- 8లో
మఠంపల్లి: చంద్రగ్రహణం నేపథ్యంలో ద్వారబంధనం చేసిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అర్చకులు సోమవారం ఉదయమే తెరిచారు. పవిత్ర కృష్ణా జలాలతో గర్భాలయంలో శ్రీమూల విరాట్‌కు ఇతర దేవతా విగ్రహాలకు సంప్రోక్షణ చేశారు. అనంతరం ఆలయంలో యథావిధిగా నిత్య పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజన మంత్రపుష్పాలతో భక్తులకు తీర్థ ప్రపాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు మాట్లాడుతూ ఈనెల 9 వరకు ఆలయంలో ఆర్జితసేవలు, నిత్యకల్యాణం నిలివేయనున్నట్టు, ఈవిషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. పూజల్లో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లి ఆలయ ద్వారాలు తెరుస్తున్న అర్చకులు