బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు | - | Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు

Sep 9 2025 6:46 AM | Updated on Sep 9 2025 6:46 AM

బీజేప

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు

సీనియర్‌ నేత గంగిడి

మనోహర్‌రెడ్డికి దక్కని స్థానం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు నలుగురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. ముగ్గురికి ఉపాధ్యక్ష పదవులు దక్కగా, మరొకరికి రాష్ట్ర కార్యదర్శి పదవి లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఆమోదంతో రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌, జరుప్లావత్‌ గోపి (కళ్యాణ్‌నాయక్‌)లను నియమించారు. రాష్ట్ర కార్యదర్శిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించారు. ఆయన గతంలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

సంజయ్‌ అనుచరుడిగా

ముద్ర పడినందుకేనా...

ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్‌ నాయకుడు గంగిడి మనోహర్‌రెడ్డికి ఈసారి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కలేదు. బండి సంజయ్‌ ప్రధాన అనుచరుడిగా మనోహర్‌రెడ్డి వ్యవహరించారని, రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించకుండా కొందరు ఎంపీలే నడ్డాపై ఒత్తిడి చేశారని అనుచరులు మండిపడుతున్నారు. దీనిపై మనోహర్‌రెడ్డి స్పందిస్తూ.. కార్యవర్గంలో తన పేరు లేకపోవడం వాస్తవమేనని, పార్టీ తన సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటుందేమోనని పేర్కొన్నారు. క్రియాశీల కార్యకర్తగా ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌గా ఆత్మకూర్‌(ఎస్‌)కు చెందిన కబడ్డీ సీనియర్‌ క్రీడాకారుడు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన అసోసియేషన్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కబడ్డీ సీనియర్‌ క్రీడాకారులు గుణగంటి వెంకన్న, బోళ్ల వెంకటరెడ్డి, బొల్లికొండ భిక్షం తదితరులు పాల్గొన్నారు.

‘సారథి’ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్‌

తిరుమలగిరి (తుంగ తుర్తి) : తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తిరుమలగిరి మండలం గుండెపురికి చెందిన పాలకుర్తి శ్రీకాంత్‌ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లెల రాములు, ఉపాధ్యక్షుడిగా ప్రియాంక, సహాయ కార్యదర్శిగా గడ్డం ఉదయ్‌, కోశాధికారిగా పాక ఉపేందర్‌, గౌరవ సలహాదారులుగా శంకర్‌, సైదులు ఎన్నికయ్యారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు1
1/3

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు2
2/3

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు3
3/3

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నలుగురికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement