
వేగంగా ప్రాథమిక విచారణ చేపట్టాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఫిర్యాదులపై వేగంగా ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం ఆత్మకూర్(ఎస్) పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిసెప్షన్‌లో బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, కేస్ ఫైళ్లు, గ్రామాల హద్దులు, కోర్టు వ్యవహారాలు, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధి లో తనిఖీలు ముమ్మరం చేసి కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, యాకూబ్, అశోక్ పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
సూర్యాపేటటౌన్ :పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా ఉంటాని ఎస్పీ కె.నరసింహ భరోసా ఇచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదుదారులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సూర్యాపేట రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.
ఎస్పీ నరసింహ