
అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంటే వాటిపై దృష్టిపెట్టి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవ్, డీఆర్‌డీఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీసీఓ పద్మ, డి ఈఓ అశోక్, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, డీఎస్‌ఓ మోహన్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు.