
11 నుంచి సాయుధ పోరాట వారోత్సవాలు
సూర్యాపేట అర్బన్ : ఈనెల 11 నుంచి 17 వరకు జరగనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం భవన్‌లో జరిగిన ఆ పార్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసమే తమ జీవితాలను అంకితం చేసిన నాటి తెలంగాణ సాయుధ పోరాట అవరవీరుల జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజెప్పాలన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెంచి పేదల జీవితాలను నాశనం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించామని గొప్పులు చెప్పుకుంటోందని విమర్శించారు. మోడల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలలుగా జీతం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యల్లావుల రాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల శ్రీనివాసరావు, యల్లంల యాదగిరి, బద్దం కృష్ణారెడ్డి, బూర వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే లతీఫ్, దేవరం మల్లీశ్వరి, ఎస్‌కే.సాయబల్లి, రెమిడాల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు