
మట్టపల్లి ఆలయం మూసివేత
మట్టపల్లి దేవాలయాన్ని మూసివేస్తున్న అర్చకులు
శివాలయం తలుపు మూసివేస్తున్న అర్చకుడు
మఠంపల్లి: చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంతోపాటు క్షేత్రంలోని శివాలయాన్ని అర్చకులు మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్ మాట్లాడారు. సోమవారం తెల్లవారుజామునే ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరిచి యథావిధిగా పూజలు కొనసాగిస్తామన్నారు.
ఫ చంద్రగ్రహణం నేపథ్యంలో ద్వారబంధనం

మట్టపల్లి ఆలయం మూసివేత