రూ.48.10 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.48.10 కోట్లు

Sep 8 2025 7:15 AM | Updated on Sep 8 2025 7:15 AM

రూ.48.10 కోట్లు

రూ.48.10 కోట్లు

పనులన్నీ సకాలంలో చేయిస్తాం..

6,168 పనులకు
రెండో విడత ఉపాధి జాతరకు నిధులు కేటాయింపు

నాగారం : రెండో విడత ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 23 మండలాల్లోని 486 గ్రామ పంచాయతీలకు పశువుల కొట్టాలు, నాడెప్‌ కంపోస్ట్‌ గుంతలు, గొర్రెల షెడ్లు, వంద కోళ్లకు సరిపడే పదేసి కోళ్లఫారాలు, సామూహిక ఇంకుడు గుంతలు, అజొల్లా (పశువులు మేత గడ్డి పెంపకం) మంజూరయ్యాయి. వీటితోపాటు అంగన్‌వాడీ భవనాలు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాల వంటి 14 రకాలైన 6,168 పనులు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.48.10 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పనులు చేసుకుంటే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.

పశువులకు రక్షణగా..

ప్రస్తుతం పశువులు కొట్టాలు లేక పెంపకందారులైన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల వద్ద రక్షణ లేకుండా ఉంటున్న పశువులపై క్రూరమృగాలు దాడులు చేస్తున్నాయి. పశువులను పోగొట్టుకొని రైతులు ఉపాధి కోల్పోతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండో విడత పనుల జాతరలో భాగంగా పనులు, నిధులు మంజూరు చేసింది. అత్యధికంగా ఒక్కొక్క మండలానికి 40 చొప్పున పశువుల కొట్టాలు మంజూరయ్యాయి. సన్న, చిన్నకారు రైతులకు పూర్తిస్థాయి రాయితీతో వీటిని కేటాయిస్తారు. ముందుగా నిర్మాణ ఖర్చు రైతే భరించాల్సి ఉంది. పూర్తయిన తర్వాత అధికారులు ఖర్చు చేసిన డ బ్బులు బిల్లు రూపంలో చెల్లి స్తారు. ఇవేకాకుండా మిగతా పనులన్నింటినీ పూర్తిస్థాయి రాయితీతోనే చేసుకోవచ్చు.

ఉపాధి హామీలో భాగంగా రెండో విడత జిల్లాకు మొత్తం 6,168 పనులు మంజూరయ్యాయి. అన్ని పనులకు కలిపి ప్రభుత్వం మొత్తం రూ.48.10 కోట్ల నిధులు కేటాయించింది. ప్రతి పనిని నాణ్యతాప్రమాణాలతో పూర్తిచేయిస్తాం.

– వీవీ.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట

ఫ 14 రకాల పనులు చేపట్టే అవకాశం

ఫ పశువుల కొట్టాలు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రాధాన్యం

ఫ అంగన్‌వాడీ, పంచాయతీ

భవనాలకూ చాన్స్‌

పనుల పేర్లు మంజూరైన నిధులు

పనులు (రూ.లక్షల్లో..)

గ్రామపంచాయతీ భవనాలు 49 980.00

అంగన్‌వాడీ భవనాలు 54 648.00

మురుగుకాల్వల చివర సోక్‌పిట్స్‌ 349 323.68

పాఠశాల మరుగుదొడ్లు 29 58.00

ఇంకుడు గుంతలు (సోక్‌ పిట్స్‌) 2,651 185.57

ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ 4 160.00

కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ 18 54.00

పండ్ల తోటలు 308 ఎకరాలు 1.30

పశువుల కొట్టాలు 2,327 2,257.19

కోళ్ల ఫారాలు 45 45.00

గొర్రెల షెడ్లు 25 25.00

అజొల్లా ఇన్ప్రాస్ట్రక్చర్‌ 93 16.54

సెగ్రిగేషన్‌ షెడ్లు 11 19.50

నాడెం కంపోస్ట్‌ పిట్స్‌ 205 36.74

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement