
పంచాయతీలు బలోపేతమయ్యేలా..
పంచాయతీల పనితీరు మెరుగుపడుతుంది
నాగారం : గ్రామ పంచాయతీల బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పాలక వర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో నిధుల కొరత ఏర్పడి సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతోపాటు పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో పంచాయతీలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీసమర్థ్ వెబ్ పోర్టల్‌శ్రీను ప్రారంభించింది. దీని ద్వారా పంచాయతీ పాలనతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్రం పర్యవేక్షించనుంది. గ్రామ పంచాయతీలకు పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా సాధారణ నిధి సమకూరుతోంది. జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులపై పర్యవేక్షణ లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి ఈ పోర్టల్‌ను వినియోగించుకుని పల్లెలను బలోపేతం చేయాలని భావిస్తోంది.
నిధులు మళ్లించకుండా నిఘా..
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకే పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరేలా పర్యవేక్షించనుంది. ఇతర రాష్ట్రాల్లో ఇదివరకే ఈ పోర్టల్‌ను ఏర్పాటు చేసి సమర్థవంతంగా పంచాయతీల పనితీరును మెరుగుపర్చింది. తాజాగా ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ ద్వారా నిధుల వెచ్చింపుతోపాటు పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా చర్యలు తీసుకోనుంది.
పోర్టల్ ద్వారా సలహాలు, సూచనలు..
గ్రామ పంచాయతీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కొత్తగా రూపొందించిన పోర్టల్ ద్వారా కేంద్రం సలహాలు సూచనలు అందించనుంది. డిజిటల్ వేదిక ద్వారా నేరుగా పంచాయతీలను పర్యవేక్షించడంతో పాటు మరింత బలోపేతం చేసేందుకు పంచాయతీరాజ్ నిపుణులతో అధ్యయన కమిటీని నియమించింది. సొంత ఆదాయ వనరులు పెరుగుదలకు ఆచరణీయమైన నమూనాను రూపొందించనుంది. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీల్లో త్వరలోనే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఫ పల్లెల ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా
కేంద్రం ప్రత్యేక పర్యవేక్షణ
ఫ కొత్తగా సమర్థ్ వెబ్ పోర్టల్‌కు
రూపకల్పన
ఫ కేంద్రం నిధులు ఇతర పనులకు మళ్లింకుండా కార్యాచరణ
ఫ త్వరలోనే అందుబాటులోకి
రానున్న పోర్టల్
కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చే సమర్థ్ వెబ్ పోర్టల్‌తో గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా పంచాయతీల పాలనతోపాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్రం పర్యవేక్షించనుంది. ఈ పోర్టల్ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు.
– కె.యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీలు బలోపేతమయ్యేలా..