
ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవం ఏదైనా ప్రజలంతా సంతోషంగా నిర్వహించుకోవాలని, జిల్లా పోలీస్ శాఖ తరఫున పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి, పోలీస్‌లకు సహకరించిన ప్రజలు, ఉత్సవ కమిటీలు, భక్తులు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన అన్ని శాఖల అధికారులకు, బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
కోదాడ: గ్రామీణ ప్రాంతాల్లోని కబడ్డీ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నరసింహారావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాలలో జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ యువతను రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రో కబడ్డీ క్రీడాకారులను అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెండ్ కర్తయ్య, క్రిష్టాఫర్‌బాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఎస్.కె.బషీర్, వేనేపల్లి శ్రీనివాసరావు, పందిరి నాగిరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రామకోటి, మంగయ్య, వెంకట్‌రెడ్డి, కోటయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడికి తరలిరావాలి
సూర్యాపేట అర్బన్ : వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పెన్షన్‌దారులకు రూ.4 వేలు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 17, 18, 19 వార్డుల పరిధిలోని చింతలచెరువు, సుందరయ్య నగర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. చేయూత పింఛన్ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న మాదిగ, కళానేత గంట భిక్షపతి, వల్దాస్ పాండు, వేల్పుల దేవయ్య, నవీన్, కనుక దేవదనం, ఇరుగు జానయ్య, మెరుగు మదన్, మెరుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు