
విద్యాభివృద్ధికి మరింత కృషి
హుజూర్‌నగర్ : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) మరింత కృషిచేయాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని వాసవీ భవన్‌లో నిర్వహించిన ఆవోపా హుజూర్‌నగర్ కమిటీ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. చదువుతోనే జీవితాల్లో వెలుగులు నిండి సమగ్రాభివృద్ధి సాధించగలుగుతామన్నారు. అనంతరం పేద ఆర్యవైశ్య విద్యార్థులకు రూ 5.05 లక్షల ఉపకార వేతనాలతో పాటు 35 మంది మహిళలకు పింఛన్‌లు అందజేశారు. ఐఐటీ చైన్నెలో సీటు సంపాదించిన ఆర్యవైశ్య పేదవిద్యార్థిని చల్లా హర్షితకు అప్పటికప్పుడు రూ 1.10లక్షల నగదు అందజేశారు. అంతకు మందు వాసవీ మాత, గాంధీజీ, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ కందికొండ శ్రీనివాస్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నందనపు శిల్ప, ఆవోపా హుజూర్‌నగర్ అధ్యక్ష కార్యదర్శులు వంగవీటి సతీష్, పెనుగొండ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, ఆవోపా నాయకులు ఇమ్మంజి రమేష్, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, పేరూరి అశోక్, నాగేశ్వర రావు, అప్పయ్య, వెంకయ్య, నరసింహారావు, రామారావు, గుండా రమేష్, రామారావు పాల్గొన్నారు.
ఫ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
మలిపెద్ది శంకర్