
జిల్లా ఉత్తమ గురువులుగా 40 మంది ఎంపిక
సూర్యాపేటటౌన్ : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 40 మందిని ఎంపిక చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లో అవార్డులు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఫ ఎంపికైన జీహెచ్‌ఎంలు
కె.ప్రభాకర్(జెడ్పీహెచ్‌ఎస్ తిమ్మాపురం, అర్వపల్లి మండలం), కాకుమాను వెంకట్‌రెడ్డి(జెడ్పీహెచ్‌ఎస్ మేళ్లచెర్వు), బి.విష్ణుమూర్తి(జెడ్పీహెచ్‌ఎస్ పసునూరు, నాగారం), చీరాల వెంకటరంగకృష్ణ(జెడ్పీహెచ్‌ఎస్ శాంతినగర్, అనంతగిరి మండలం) ఉన్నారు.
ఫ స్కూల్ అసిస్టెంట్లు : ముక్కాముల జానకిరాములు(పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ కోదాడ), ఆరే వీరారెడ్డి(జెడ్పీహెచ్‌ఎస్ పాలవరం, అనంతగిరి), బయ్యారపు శ్రీదేవి(జీహెచ్‌ఎస్ హుజూర్‌నగర్), బుడిగ వీరబాబు(టీజీఎంఎస్ మఠంపల్లి), జిల్లేపల్లి జానయ్య(జెడ్పీహెచ్‌ఎస్ తిరుమలగిరి), శ్రీపాది ఉపేంద్ర(జెడ్పీహెచ్‌ఎస్ పెన్‌పహాడ్), బూర సైదయ్యగౌడ్(టీజీఎంఎస్ మునగాల), రాజుల లక్ష్మీనారాయణ(టీఎస్‌ఎంఎస్ మఠంపల్లి), కాటమల్లు సోమసుందర్(టీజీఎంఎస్ పసునూరు, నాగారం), షామేబేగం(ఎస్‌టీ జోసెఫ్ సీసీఆర్ విద్యానిలయం, కోదాడ), బోళ్ల కవిత(జెడ్పీహెచ్‌ఎస్ అమరవరం, హుజూర్‌నగర్), సోమయాజుల సూర్యనారాయణ(జెడ్పీహెచ్‌ఎస్ మఠంపల్లి), కె.కృష్ణవేణి(జెడ్పీహెచ్‌ఎస్ రత్నవరం, నడిగూడెం), కె.శ్రీనివాసరావు(జెడ్పీహెచ్‌ఎస్ చిమిర్యాల, కోదాడ), సపావత్ స్వప్న(జెడ్పీహెచ్‌ఎస్ పాలకవీడు), షేక్ రెహనబేగం(జెడ్పీహెచ్‌ఎస్ రామాపురం, మేళ్లచెర్వు), రువ్వ శ్రవణ్‌కుమార్(ఎంపీయూపీఎస్ రెడ్లకుంట, కోదాడ), ముక్కపాటి స్వరూపారాణి(పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ కోదాడ), జి.రాంరెడ్డి(జెడ్పీహెచ్‌ఎస్ గరిడేపల్లి), మహ్మద్‌అబ్దుల్ ముబీన్(పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ కాపుగల్, కోదాడ) ఉన్నారు.
ఫ ఎస్‌జీటీలు : మేకల సందీప్‌కుమార్(ఎంపీపీఎస్ పొనుగోడు, గరిడేపల్లి), ఎన్.అనసూర్యమ్మ(ఎంపీపీఎస్ చింతలపాలెం), షేక్ పీర్ సాహెబ్‌టీజీటీ(టీజీఎంఎస్ కర్విరాల, నడిగూడెం), పల్లేటి అభినవ్(ఎంపీపీఎస్ హెచ్‌డబ్ల్యూ గోరెంట్ల, మద్దిరాల), పొన్నాల వనజ(ఎంపీపీఎస్ ఆత్మకూర్.ఎస్), గౌలికర్ ఇందిర(ఎంపీపీఎస్ జాజిరెడ్డిగూడెం), బి.స్వరూపరాణి(ఎంపీపీఎస్ అర్వపల్లి), డి.సుజాత(ఎంపీపీఎస్ తమ్మవరం, చింతలపాలెం), వలవోజు సులోచన(ఎంపీపీఎస్ పాత సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్), ఇందిరాల జ్యోతి(ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ లింగగిరి, హుజూర్‌నగర్), రణబోతు నర్సిరెడ్డి(ఎంపీపీఎస్ బరాఖత్‌గూడెం, మునగాల), రణపంగు కనకతార(ఎంపీపీఎస్ మూసీఒడ్డు సింగారం, పాలకవీడు), పి.శ్రీధర్(ఎంపీపీఎస్ పుల్జబండతండా, నేరేడుచర్ల), బి.భరత్‌బాబు(ఎంపీయూపీఎస్ జగన్నాథపురం, మునగాల), బోళ్ల గోవిందరెడ్డి(సీఐ, జెడ్పీహెచ్‌ఎస్ గరిడేపల్లి), షాహిన్ షేక్(కేజీబీవీ సూర్యాపేట) ఉన్నారు.
ఫ జాబితా ప్రకటించిన డీఈఓ
ఫ 9న అవార్డుల ప్రదానం