
అదే బారులు.. అవే తిప్పలు
అనంతగిరి: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సీజన్ ప్రారంభం నుంచి రైతులు పీఏసీఎస్, గోదాములు, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేథప్యంలో శనివారం అనంతగిరిలోని పీఏసీఎస్ వద్ద రైతలు యూరియా కోసం వచ్చిన ఘర్షణపడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు యూరియా లారీ వచ్చి బస్తాలు దిగుమతి చేస్తుండగానే కొందరు రైతులు వచ్చి సీరియల్ రాయించుకుని క్యూలైన్‌లో నిలబడ్డారు. మధ్యలో కొందరు రైతులు వచ్చి చేరడంతో పరస్పర ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడికి దిగారు. పోలీసులు రావడంతో ఘర్షణ సద్దుమణిగింది. అనంతరం అధికారులు రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా అందించారు. యూరియా అందని వందమందికిపైగా రైతులు వెనుదిరిగారు.
సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు
మేళ్లచెరువు : యూరియా కోసం వచ్చిన మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని కందిబండ, మేళ్లచెరువు పీఏసీఎస్‌ల వద్ద శనివారం తెల్లవారు జామునుంచే రైతులు యూరియా కోసం క్యూకట్టారు. అయితే మేళ్లచెరువు మండల కేంద్రంలో లైన్‌లో నిలుచున్న కప్పలకుంటతండాకు చెందిన గిరిజన మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో పక్కనే ఉన్న రైతులు ఆమె మొఖం కడిగి మంచినీరు తాగించి పక్కన కూర్చోబెట్టారు. రైతులు ఎండలో నిలబడడంతో మధ్యాహ్నం తరువాత టెంట్ వేసి నీడ కల్పించారు. రెండు లారీల యూరియా మాత్రమే రావడంతో మొత్తంగా రైతులకు పంపిణీ చేశారు.
ఫ యూరియా కోసం రైతుల అవస్థలు
ఫ పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు
ఫ అనంతగిరిలో రైతుల మధ్య ఘర్షణ
ఫ మేళ్లచెరువు సహకార సంఘం వద్ద మహిళా రైతుకు అస్వస్థత