
గంగ ఒడికి గణనాథుడు
నిమజ్జన వేడుకను పరిశీలించిన ఎస్పీ
సూర్యాపేట : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగాయి. వెళ్లిరావయ్య గణపయ్య అంటూ జిల్లాలో పలుచోట్ల అర్ధరాత్రి వరకు భక్తులు గణనాథుడి విగ్రహాల నిమజ్జనం చేశారు. ఉదయం నుంచే మహిళల కోలాటాలు, యువత తీన్మార్ స్టెప్పులతో గణనాథుడి శోభా యాత్ర అట్టహాసంగా కొనసాగింది. మొదట లడ్డూలకు వేలం పాటలు నిర్వహించారు. వేలం పాటల్లో భక్తులు పలువురు పాల్గొని రూ.లక్షల్లో వేలం పాట పాడి లడ్డూలను దక్కించుకొని తమ భక్తిభా వాన్ని చాటుకున్నారు. అలాగే గణేష్ మండపాల వద్ద లడ్డూలు, స్కూటీలు లక్కీ డ్రా ఏర్పాటు చేసి చివరి రోజు కావడంతో లక్కీ డ్రా తీసి డ్రాలో వచ్చిన టోకెన్ ఆధారంగా విజేతలకు లడ్డూలు, స్కూటీలను అందజేశారు.
భానుపురిలో ఘనంగా..
జిల్లా కేంద్రంలో మొదట పూలసెంటర్ వద్ద శ్రీ వేదాంత భజన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. పూల సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డిలు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, భానుపురి ఉత్సవ సమితి సభ్యులు పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు.
రూ.2.20లక్షల ధర పలికిన లడ్డూ
జిల్లా కేంద్రంలోని పూల సెంటర్ వద్ద భానుపురి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వేదిక వద్ద వేదాంత భజన మందిరం 74వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక లడ్డూకు వేలం పాట నిర్వహించగా బొడ్రాయి బజార్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తి రూ.2.20లక్షలకు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు.
2వేలకుపైగా విగ్రహాల నిమజ్జనం
జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,250 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే అందులో శుక్రవారం ఆయా ప్రాంతాల్లో జరిగిన నిమజ్జన వేడుకల్లో సుమారు 2వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు అధికారులు అంచనా వేశారు. శుక్రవారం కావడంతో గ్రామాల్లో కొంత మంది శనివారం కూడా నిమజ్జనం చేయనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువుతో పాటు సూర్యాపేట మండలం రత్నపురం వద్ద గల మూసీ రిజర్వాయర్, కోదాడ పెద్ద చెరువు వద్ద, మట్టపల్లి బ్రిడ్జి వద్ద, పాలకవీడు మండలం కృష్ణానది మహంకాళిగూడెం వద్ద, నేరేడుచర్ల పరిధిలోని చిల్లేపల్లి మూసీ బ్రిడ్జి వద్ద నిమజ్జనం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు నిమజ్జనం ప్రక్రియ కొనసాగింది.
జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్‌పై, రత్నపురం సమీపంలోని మూసీ రివర్ వద్ద జరిగే వినాయక నిమజ్జన ప్రక్రియనుకు సంబంధించి బందోబస్తును, నిమజ్జన తీరును జిల్లా ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. సద్దుల చెరువు (మినీ ట్యాంక్‌బండ్) వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలో జరుగుతున్న శోభాయాత్రను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, తదితరులు ఉన్నారు.
కనుల పండువగా గణేష్ శోభాయాత్ర
ఫ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు
ఫ తీన్మార్ స్టెప్పులతో అలరించిన యువత
ఫ అర్ధరాత్రి వరకు కొనసాగిన
నిమజ్జన కార్యక్రమం

గంగ ఒడికి గణనాథుడు

గంగ ఒడికి గణనాథుడు

గంగ ఒడికి గణనాథుడు

గంగ ఒడికి గణనాథుడు

గంగ ఒడికి గణనాథుడు