
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాత
ఫ పెన్‌పహాడ్‌లో రైతుల రాస్తారోకో
ఫ సకాలంలో యూరియా
అందించాలని డిమాండ్
పెన్‌పహాడ్ : సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని చీదెళ్ల పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎస్‌ఐ గోపికృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి రైతుకు ఒక్క బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. తమకు సకాలంలో సరిపోను యూరియా సరఫరా చేయడం లేదని, అదికూడా సిబ్బంది ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ.. రైతుల వద్దకు వెళ్లి సక్రమంగా పంపిణీ చేసేలా చూస్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. దీంతో ఒక్కో రైతుకు ఒక్క బస్తా చొప్పున 550 బస్తాలను పంపిణీ చేయగా సుమారు 200మంది రైతులకు యూరియా దొరకక వెనుదిరిగారు.
తిరుమలగిరిలో బారులు
తిరుమలగిరి : తిరుమలగిరి మండలానికి రెండు రోజులకు ఒకసారి ఒక లోడ్ యూరియా మాత్రమే వస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం యూరియా రావడంతో రైతులు పీఏసీఎస్ బారులుదీరారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా ఇచ్చారు. చాలా మంది రైతులకు యూరియా దొరకక నిరుత్సాహంగా వెనుదిరిగారు.
అర్వపల్లి : అర్వపల్లి, తిమ్మాపురం పీఏసీఎస్ లకు కలిపి శుక్రవారం ఒకే ఒక్క లారీ యూరియా వచ్చింది. దీంతో యూరియాను సగం లారీ చొప్పున పంచుకున్నారు. రెండు పీఏసీఎస్‌ల వద్ద యూరియా చాలక రైతులు ఘర్షణకు దిగారు. యూరియా చాలక అనేక మంది రైతులు వెనుదిరిగారు. ఎస్‌ఐ ఈట సైదులు ఆధ్వర్యంలో రెండు కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాత