మఠంపల్లి: యూరియా కోసం మఠంపల్లి మండల కేంద్రంలోని మట్టపల్లి –హుజూర్‌నగర్ ప్రధాన రహదారిపై సీపీఎం,సీపీఐ ఆధ్వర్యంలో రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు, రైతులు మాట్లాడుతూ మండలంలో ఆయకట్టు, చివరి ఆయకట్టు పరిధిలో నెలరోజులుగా వరినాట్లు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో నాట్లు ఎదుగుదలకు నోచుకోవడం లేదన్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పాండునాయక్, మండల కార్యదర్శి బాలునాయక్, సీపీఐ మండలకార్యదర్శి అమరారపు పున్నయ్య, నాయకులు కోటయ్య, లక్ష్మణ్‌నాయక్ , బద్రునాయక్, నాగునాయక్, సురేష్, మగతా, మాంగూ, జెత్రామ్ నాయక్, సైదా తదితరులు ఉన్నారు.