
కేసుల పరిష్కారంలో మొదటిస్థానంలో నిలుపుదాం
చివ్వెంల(సూర్యాపేట) : ఈనెల 13 న నిర్వహించే జాతీయ మెగాలోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదామని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పిలుపునిచ్చారు. లోక్ అదాలత్‌పై బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో చిట్ ఫండ్‌కంపెనీలు, బ్యాంకులు, బీమా కంపెనీ, ఆర్‌టీసీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయా సంస్థల అధికారులు ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. తద్వారా జిల్లా మొదటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాని రాజీపడే కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీని వల్ల రెండు వర్గాల వారు గెలిచిన వారు అవుతారని, సమయం, ధనం వృథాకాకుండా ఉంటుందన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, జూనియర్ సివిల్ జడ్జి నాగ అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధా న కార్యదర్శి సుంకరబోయిన రాజు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద