
దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం
చిలుకూరు: కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలను అన్నిరంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతానని మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. చిలుకూరు మండలం సీతరాంపురం గుట్టలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్ కు కోదాడ– జడ్చర్ల హైవే నుంచి రూ. 10 కోట్లలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈరెండు నియోజకవర్గాల్లో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కోదాడ, హుజూర్‌నగర్‌కు ఐటీఐ కాలేజీలు, కోదాడలో నూతనంగా నవోదయ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీలు బజ్జూరి వెంకట్‌రెడ్డి, బొలిశెట్టి నాగేంద్రబాబు, బండ్ల కోటయ్య, కాంగ్రెస్ పార్టీ చిలుకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాత వెంకటేశ్వర్లు, పిండ్రాతి హనుంతరావు పాల్గొన్నారు.