1.63 లక్షల కుటుంబాలకు ధీమా | - | Sakshi
Sakshi News home page

1.63 లక్షల కుటుంబాలకు ధీమా

Sep 1 2025 6:14 AM | Updated on Sep 1 2025 6:14 AM

1.63

1.63 లక్షల కుటుంబాలకు ధీమా

గతేడాదికి సంబంధించి బీమా డబ్బులు రావాల్సి ఉంది

పథకం అమలు ఇలా..

2025–26 సంవత్సరానికి గాను రైతుబీమా పథకంలో జిల్లావ్యాప్తంగా 1,63,480 మంది నమోదయ్యారు. 2024–25 సంవత్సరానికి గాను జిల్లాలో మృతిచెందిన కొంత మంది రైతులకు బీమా డబ్బులు రావాల్సి ఉంది.

– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

నాగారం : రైతుబీమా పథకానికి ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,63,480 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కాలంలో పట్టాదారు పాస్‌పుస్తకం పొందిన వారు, గతంలో పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నా పథకంలో చేరని వారు, 19 సంవత్సరాల వయస్సు నిండినవారు, సవరణల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గతనెల 13 వరకు అవకాశం కల్పించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులను ఏఈఓలు గతనెల 14 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు 59 ఏళ్లు నిండిన వారిని పథకం నుంచి తొలగించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏడాది పాటు రైతులకు బీమా రక్షణ కొనసాగనుంది.

65 ఏళ్లకు పెంచితే ప్రయోజనం

పథకంలో నమోదైన వారికి సంబంధించిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే జీవిత బీమా సంస్థకు చెల్లిస్తుంది. పథకంలో నమోదై ఉండి, ఏ కారణంతో అయినా రైతు మృతి చెందితే కుటుంబానికి రూ.5లక్షల బీమా పరిహారం అందుతుంది. పథకం మొదలైన 2018వ సంవత్సరం నుంచి జిల్లాలో 5,369 మంది రైతులు మృతిచెందగా వీరికి రూ.262.60 కోట్ల పరిహారం చెల్లించారు. ఇటీవల కాలంలో మృతిచెందిన జిల్లాలోని కొందరు రైతుల కుటుంబాలకు పరిహారం రావాల్సింది ఉంది. 2024–25లో 839 మంది రైతులు మృతి చెందగా 730 మందికి మాత్రమే రైతు బీమా పరిహారం అందింది. మిగతా వారికి బీమా పరిహారం అందాల్సి ఉంది.

ఫ రైతు బీమా పథకానికి

ముగిసిన దరఖాస్తుల గడువు

ఫ జిల్లా వ్యాప్తంగా

1,63,480 మంది నమోదు

ఫ వచ్చే ఏడాది ఆగస్టు 14 వరకు

బీమా వర్తింపు

సంవత్సరం నమోదు మృతులు పరిహారం

(రూ.కోట్లలో)

2018–19 1,27,486 608 30.40

2019–20 1,30,524 639 31.95

2020–21 1,31,571 981 49.05

2021–22 1,41,925 772 38.60

2022–23 1,51,135 726 36.20

2023–24 1,58,860 804 39.90

2024–25 1,63,549 839 36.50

2005–26 1,63,480 – –

1.63 లక్షల కుటుంబాలకు ధీమా1
1/1

1.63 లక్షల కుటుంబాలకు ధీమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement