
ఎన్‌ఆర్‌ఐ శరత్‌చంద్ర సేవలు ప్రశంసనీయం
మద్దిరాల : జన్మభూమిపై మమకారంతో గ్రామస్తుల కోసం ఎన్‌ఆర్‌ఐ వేముగంటి శరత్‌చంద్ర అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ నరసింహ, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో గ్రామానికి చెందిన వేముగంటి సుధాకర్‌రావు కుమారుడు ఎన్‌ఆర్‌ఐ వేముగంటి శరత్‌చంద్ర తన కుమారుడు ఆద్య కోరిక మేరకు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌తో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. అమెరికాలో స్థిరపడినా సొంత ఊరి ప్రజల కోసం తన వంతుగా శరత్‌చంద్ర చేస్తున్న సేవలను కొనియాడారు. ఇప్పుడే కాదు కరోనా సమయంలో కూడా జిల్లాకు చెందిన డాక్టర్లతో మాట్లాడి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందించారని, కుక్కడం గ్రామంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసర సరకులు సమకూరుస్తూనే వైద్యసేవలు అందించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. చిన్న వయస్సులోనే గొప్పగా ఆలోచించి వైద్యశిబిరం ఏర్పాటు చేయించిన శరత్‌చంద్ర కుమారుడు ఆద్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ నరసింహ, కుక్కడం గ్రామ మాజీ సర్పంచ్ ముక్కాల వాసుదేవరెడ్డి, నాయకులు ముక్కాల భూపాల్‌రెడ్డి, నాగెల్లి అరుణ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కాల అవిలుమల్ల యాదవ్, మాజీ జెడ్పీటీసీ బానోత్ మంజుల మాన్‌సింగ్, పులుసు రామనర్సు, మద్దెల భిక్షపతి, మద్దెల రాములు, బానోత్ శ్రీనివాస్, వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ,
ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తంరెడ్డి

ఎన్‌ఆర్‌ఐ శరత్‌చంద్ర సేవలు ప్రశంసనీయం