
మట్టి గణపతి మేలు
సూర్యాపేటలోని బొడ్రాయి బజార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహానికి బదులుగా గత రెండేళ్లుగా మట్టి గణ పయ్యను నెలకొల్పుతున్నారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపయ్య ను ప్రతిష్ఠించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పుణ్యం.. బహుమతి భాగ్యం
సూర్యాపేటలోని పీఎస్‌ఆర్ సెంటర్‌లో పీఎస్‌ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా ను వెల్లడించనున్నట్లు నిర్వాహకులు తెలి పారు. డ్రాలో గెలుపొందిన వారికి లక్షా 30 వేల రూపాయల విలువైన స్కూటీతో పా టు 21 కేజీల స్వామి వారి ప్రసాద లడ్డూ ను బహూకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట

మట్టి గణపతి మేలు