
ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు గోనె విజయ, ఖమ్మంపాటి లక్ష్మమ్మ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులయ్యారని తెలిపారు. అనేకమంది కేసులకు భయపడకుండా ఉద్యమ సాధనలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షురాలు పుట్టా సోవమ్మ, కార్యదర్శి నోముల ఉమ, పట్టణ అధ్యక్షురాలు బంటు ఎల్లమ్మ, కార్యదర్శి కొమ్మాండ్లపల్లి సుజాత, పట్టణ కమిటీ సభ్యులు మాచర్ల రామలక్ష్మి, సాయని సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.