
సుదీర్ఘకాలం సేవలు అభినందనీయం
సూర్యాపేట టౌన్ : పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించడం అభినందనీయమని ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన కోదాడ పట్టణ 2వ ఎస్‌ఐ లింగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్‌ఐ భిక్షం, తిరుమలగిరి ఏఎస్‌ఐ నర్సయ్య, తుంగతుర్తి హెడ్ కానిస్టేబుల్ గోపి నాయక్ ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఓ మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ నరసింహ