ఓటరు జాబితాపై రాజకీయ నాయకులతో సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాపై రాజకీయ నాయకులతో సమీక్ష

Aug 31 2025 7:13 AM | Updated on Aug 31 2025 7:13 AM

ఓటరు జాబితాపై రాజకీయ నాయకులతో సమీక్ష

ఓటరు జాబితాపై రాజకీయ నాయకులతో సమీక్ష

నాగారం : ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని మండల ప్రత్యేక అధికారి, డీఈఓ అశోక్‌ కోరారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ముసాయిదా ఓటరు జాబితా సవరణకు సహకరించాలని కోరారు. సెప్టెంబర్‌ 2న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ హరి కిషోర్‌శర్మ, ఎంపీడీఓ మారయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నూతనకల్‌ : ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులకు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఎం. బాలు మాట్లాడారు. ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ శశికళ, పంచాయతీ కార్యదర్శులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

తిరుమలగిరి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను సరిచూసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రమేష్‌ రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ హరిప్రసాద్‌, ఎంపీడీఓ లాజరస్‌, మండల పంచాయతీ అధికారి భీమ్‌సింగ్‌, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌ : ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని మండల ప్రత్యేక అధికారి రాము అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదాలపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్‌ 2న తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అనంతరం ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ లాలు, ఎంపీడీఓ జానయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెన్న సీతారాంరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అర్వపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఓటరు ముసాయిదా జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, మార్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఏఓ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్‌ బాషపాక శ్రీకాంత్‌, ఎంపీడీఓ టి.గోపి, సూపరింటెండెంట్‌ రామకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఆత్మకూర్‌ (ఎస్‌) : ఓటరు జాబితాలో అభ్యంతరాలపై శనివారం మండల స్థాయి అఖిలపక్ష నాయకులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడారు. ఓటర్‌ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆమీన్‌సింగ్‌, ఎంపీడీఓ హాసిం, వివిధ పార్టీల నాయకులు తూడి నరసింహారావు, తంగెళ్ల వీరారెడ్డి, డేగల వెంకటకృష్ణ, బత్తుల ప్రసాద్‌, శిగ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

మద్దిరాల : ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల మండల అధ్యక్షులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement