
రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం
త్వరలోనే పనులు చేపడతాం
మరమ్మతులు చేయాలి
పెన్‌పహాడ్ : సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో ఈ గుంతలు నీటితో నిండి, రోడ్డు పరిస్థితిని అర్థం చేసుకోలేని విధంగా తయారయ్యాయి. దీని వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పెన్‌పహాడ్ మండలంలోని మాచారం, సింగారెడ్డిపాలెం, దూపహాడ్ వంటి గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రహదారి పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోంది. మాచారంలోని ఒక పెద్ద గుంత వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో, గ్రామస్తులే స్వయంగా ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. వారు ఆ గుంత చుట్టూ బారికేడ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రంలోని మరో గుంత వద్ద జెండా కట్టి వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన గుంతలను పూడ్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్డు మరమ్మతులు లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
సూర్యాపేట – గరిడేపల్లి ప్రధాన
రహదారిపై భారీ గుంతలు
వర్షాలకు నీరు నిలిచి
చోటుచేసుకుంటున్న ప్రమాదాలు
మరమ్మతులు చేపట్టాలని
ప్రయాణికుల వేడుకోలు
రహదారి మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే రోడ్డుపై గుంతలను పూడ్చి, మరమ్మతులు చేయిస్తాం. సమస్యను పరిష్కరిస్తాం. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం.
– యుగేందర్, ఆర్‌అండ్‌బీ ఏఈ
రహదారిపై భారీ గుంతలతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డుపై ప్ర యాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలి. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి.
– జానయ్య, మాచారం

రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం

రోడ్డు అధ్వానం.. ప్రయాణం నరకం