
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపుదాస్ సాయికుమార్ విమర్శించారు. శనివారం సీపీఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏడో వార్డులో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటా యించాలని కోరారు. అలాగే వన్ టౌన్ పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు సీపీఎం శాఖ కార్యదర్శి రాచూరి జానకి రాములు, సహాయ కార్యదర్శి దున్న ప్రమోద్, నాయకులు రాచూరి భవాని, గోపాల్ రావు, చౌగాని లక్ష్మయ్య, సోమగాని బాలాజీ, కావలి శ్రీను, రాచూరి నర్సయ్య, లక్ష్మి పాల్గొన్నారు.
సుందరయ్య నగర్‌పై నిర్లక్ష్యం
పట్టణంలోని సుందరయ్య నగర్ అభివృద్ధి పట్ల ము న్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి లేదని, ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకునే వారే లేరని సీపీఎం టూ టౌన్ కార్యదర్శి పిండికి నాగమణి అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. సుందరయ్య కాలనీలో అనేకమంది పేదలు పక్కా ఇళ్లు లేక గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం టూ టౌన్ కమిటీ సభ్యులు బత్తుల వెంకన్న, ముక్కెర్ల వెంకన్న, కంచుగట్ల శ్రీనివాస్, శీరంశెట్టి శ్రీనివాస్, శాఖ సభ్యులు లింగమ్మ, వెంకటమ్మ, రేణుక, జానకమ్మ పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో కొరవడిన పారదర్శకత
మద్దిరాల : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ముకుందాపురంలో ప్రజాసమస్యలపై సర్వే నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నా పట్టించుకునే వారే లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పోలోజు సైదులు, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, మద్దెల కోటయ్య, కల్లెపల్లి భాస్కర్, దీకొండ ఉపేందర్, బ్రహ్మం, శివరాత్రి మల్లయ్య, ఆలకుంట్ల ఇద్దయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.