
గణనాథుడి విగ్రహాల వద్ద పూజలు, అన్నదానం
సూర్యాపేట : గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద మార్గదర్శి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడి విగ్రహం వద్ద శనివారం అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి యూత్ గౌరవ అధ్యక్షుడు నేరెళ్ల మధు గౌడ్, అధ్యక్షుడు సలిగంటి శ్రీనివాస్, గోపగాని గిరి, సూరయ్య, నేరెళ్ల నరేష్, మిథున్, తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం.. మహాదానం
హిందూ ధర్మంలో అన్నదానం మహాదానమని బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజేన్ జాడ్ మహాగణపతి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షుడు రాంబాబుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో రెబల్ శ్రీనివాస్, గాజుల రాంబాయమ్మ, శివ, సాయి, రాజీవ్, సన్ని పాల్గొన్నారు.
చివ్వెంల : వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని వివి ధ గ్రామాల్లో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి, వీరారెడ్డి, జానయ్య, మార్క్, దిలీప్ పాల్గొన్నారు.
అర్వపల్లి : అర్వపల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరబోయిన మహరాజు, కె.అవిలయ్య, దాసరి సోమయ్య, నాగరాజు, నిరంజన్, నిర్వాహకులు పాల్గొన్నారు.
నాగారం : అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పసునూర్‌లో మెగా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద తొడుసు సోమక్క జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గణనాథుడి విగ్రహాల వద్ద పూజలు, అన్నదానం