
ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెస్తాం
హుజూర్‌నగర్ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోగల గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్ లాల్ పవార్‌లతో కలిసి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను నిర్లక్ష్యం చేసిందన్నారు.
2026 జూలై నాటికి పనులు పూర్తి చేయాలి
పులిచింతలలోని తెలంగాణ జెన్‌కో విద్యుత్ తయారు చేసిన తర్వాత వచ్చే నీటిని రూ.320కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి తద్వారా మేళ్లచెరువు, కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాల్లో 14,100 ఎకరాలకు అందిస్తామన్నారు. రూ. 1450 కోట్లతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించి మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53 వేల ఎకరాలకు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 188.32 ఎకరాలకు భూ సేకరణ చేసి నష్ట పరిహారం అందించామన్నారు. 2026 జూలై నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాలేరు వాగుపై రూ. 47.64 కోట్లతో రెడ్లకుంట లిఫ్ట్ నిర్మించి దాని ద్వారా 4,460 ఎకరాలకు, రూ. 54.03 కోట్లతో రాజీవ్ శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి దీని ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్ల వివరించారు. ఆర్–9 కాలువపై రూ. 8.45 కోట్లతో లిఫ్ట్ నిర్మించి మునగాల, నడిగూడెం మండలాల్లో 3,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాన్నారు. రూ. 244 కోట్లతో మోతె లిఫ్ట్ నిర్మించి తద్వారా 45,736 ఎకరాలకు నీటి సరఫరా చేస్తామన్నారు. పాలకవీడు మండలంలో రూ. 302.20 కోట్లతో జవహర్ జాన్‌పహాడ్ లిఫ్ట్ నిర్మించి దీని ద్వారా 10 వేల ఎకరాలకు నీరందించే పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రూ 26.02 కోట్లతో నిరించే బెట్టెతండా లిఫ్ట్ ద్వారా 2041 ఎకరాలకు నీరు అందుతుందన్నారు. రూ. 31 కోట్లతో నిర్మించే నక్కగూడెం లిఫ్ట్ ద్వారా 3,200 ఎకరాలకు నీరు అందుతుందని దానిని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ రమేష్ బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీతారామయ్య, ఎస్‌ఈ బీవీ ప్రసాద్, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీఈఓ ఆశోక్, జిల్లా సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, ఆర్‌డీఓ శ్రీనివాసులు ఆర్‌టీసీ సీఈ కవిత, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, నాయకులు సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, సుబ్బారావు, దొంగరి వెంకటేశ్వర్లు, తన్నీరు మల్లికార్జున్, గెల్లి రవి, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, దొంతగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై హైదరాబాద్‌లో సమీక్ష

ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెస్తాం