
విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జున్ రెడ్డి సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన ముస్లిం మైనారిటీ యోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను మంగళవారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిని నాగార్జున్‌రెడ్డి పరిశీలించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర సాధనలో ముస్లింలు చేసిన సేవలు మరువు లేనివి అని అన్నారు. దేశభక్తుల జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియజేయడం అభినందనీయం అన్నారు. ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, అబ్దుల్లా, ప్రిన్సిపల్ వినోద, ఖాలెద్‌అహ్మద్, అస్గర్ సాహబ్, సీఐటీయూ జిల్లా మాజీ కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టపల్లి సైదులు, నర్సింహారావు, వేల్పుల వెంకన్న, సయ్యద్ ఫకీర్ హుస్సేన్, జహీర్, రహీం, అజీజ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.