
కాళేశ్వరంపై వాస్తవాలను రైతుల ముందుంచాలి
సూర్యాపేటటౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పిన వాస్తవాలను రైతుల ముందుంచాలని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ కార్యకర్తలను కోరారు. మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సూర్యాపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్క్రీన్‌పై బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించాలి
సూర్యాపేటటౌన్: పూణేలో జరిగే జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లోనూ పతకాలు సాధించాలని ఎస్పీ నరసింహ ఆకాంక్షించారు. మమునూరు లో నిర్వహించిన రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బంది, పోలీస్ డాగ్ రోలెక్స్‌ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక దర్యాప్తు పోటీల్లో హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్ చక్రవర్తి తృతీయ స్థానం, నార్కోటిక్ డాగ్ రోలెక్స్‌లో డాగ్ ట్రైనర్ సతీష్ ద్వితీయ స్థానం పొందారని వివరించారు. కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంపై వాస్తవాలను రైతుల ముందుంచాలి