
50వేల మంది జనసమీకరణ
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సోమవారం చేపట్టనున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి 50 వేల మంది జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు, సమ భావన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తారని అంచనా వేశారు. జన సమీకరణకు 300 ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయం వెనక ఉన్న 35 ఎకరాల్లో సభా స్థలి ఏర్పాటు చేశారు. రెండు హెలిపాడ్లు, 11 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. సభా వేదికపై కూర్చునేందుకు ప్రొటోకాల్ ప్రకారం కొందరికే అవకాశం కల్పించనున్నారు. సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, రాష్ట్ర, జిల్లా అధికారులు కూర్చోనున్నారు.
ఫ 35 ఎకరాల్లో సభాస్థలి
ఫ 11 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్