వేలానికి దొడ్డు బియ్యం | - | Sakshi
Sakshi News home page

వేలానికి దొడ్డు బియ్యం

Jul 9 2025 6:23 AM | Updated on Jul 9 2025 6:23 AM

వేలాన

వేలానికి దొడ్డు బియ్యం

ప్రభుత్వానికి వివరాలు పంపించాం

రేషన్‌షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించాం. రేషన్‌షాపుల్లో నిల్వ ఉన్న బియ్యం బాధ్యతలను డీలర్లకు అప్పగించాం. జిల్లాలో సుమారు 12వేల క్వింటాళ్లకు పైగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుడడంతో దొడ్డు బియ్యాన్ని స్టాక్‌ చేశాం.

– శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి

చిలుకూరు: రేషన్‌షాపుల ద్వారా ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయాయి. ఇక ఎక్కువ కాలం ఉంచితే అ బియ్యం చెడిపోయే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని 610 రేషన్‌ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వల వివరాలు పంపాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖ ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు ఆ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో. . .

గతంలో ఎంత మేర నిల్వలున్నాయనేది ఈ పాస్‌ యంత్రాల్లో తెలిసేది. వాటిలో సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో గతంలో ఉన్న నిల్వలు తెలియడం లేదు. కేవలం గోదాముల్లో మాత్రమే రేషన్‌ దుకాణాలకు సంబంధించిన నిల్వలు తెలుస్తున్నాయి. దీని ఆధారంగా ఏయే దుకాణాల్లో ఎంత మేర నిల్వలున్నాయి అనే దానిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో పంపిణీ చేయగా మిగిలిన దొడ్డు బియ్యాన్ని దుకాణాల్లోనే నిల్వ చేయాలని అధికారులు ఆదేశించారు. నాలుగు నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు దుకాణాల్లోనే ఉన్నాయి. వాటిని కాపాడే బాధ్యతనూ డీలర్లకే అప్పగించారు.

12,084 క్వింటాళ్లు

జిల్లా వ్యాప్తంగా 610 రేషన్‌ షాపుల్లో 12,084 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు నిల్వలను సేకరించి ప్రభుత్వానికి పంపనున్నారు. జిల్లాలో 3,26,055 రేషన్‌కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడంతో పాటు వాటికి కోటాను కూడా విడుదల చేసింది.

ఫ సన్నాహాలు చేస్తున్న పౌరసరఫరాల శాఖ

ఫ జిల్లా వ్యాప్తంగా రేషన్‌షాపుల్లో 12,084 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు

ఫ వీటిని కాపాడే బాధ్యత డీలర్లకు అప్పగింత

వేలానికి దొడ్డు బియ్యం1
1/1

వేలానికి దొడ్డు బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement