
లేబర్ కోడ్‌లు రద్దయ్యే దాకా పోరాటం
సూర్యాపేట : లేబర్ కోడ్‌లు రద్దయ్యేదాకా పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేట మండలం రాయినిగూడెంలో పెయింటర్స్, భవన నిర్మాణ కార్మికులను ఆయన కలిసి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా చేస్తోందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్‌లు తెచ్చిందని అన్నారు. ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎం. శేఖర్, నాయకురాలు సైదమ్మ, కామల్ల లింగయ్య, చింతమల్ల వెంకన్న, కిరణ్, నవీన్, నాగయ్య, వీరారెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి నిత్య కల్యాణం జరిపారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా
ఇన్‌చార్జిగా సంపత్‌కుమార్
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్ల గొండ జిల్లా ఇన్‌చార్జి గా.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి లను నియమించింది. ఈ మేరకు పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏఐసీసీ సెక్రటరీ ఎస్.సంపత్‌కుమార్ నియమితులయ్యారు.

లేబర్ కోడ్‌లు రద్దయ్యే దాకా పోరాటం

లేబర్ కోడ్‌లు రద్దయ్యే దాకా పోరాటం