అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి | - | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

Jul 8 2025 7:16 AM | Updated on Jul 8 2025 7:16 AM

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

కోదాడ: రైతుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకొని భారీగా దండుకోవాలని చూసిన ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో వెనకడుగు వేశారు. నిన్నటి వరకు యూరియా అమ్మితే నష్టపోతామని ఏకంగా తీర్మానాలు చేసిన దుకాణదారులు .. అలాంటిది ఏమీ లేదు.. ఎమ్మార్పీకే అమ్ముతామని ఆదివారం అధికారుల సమక్షంలో చెప్పడం గమనార్హం. వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో నాగార్జునసాగర్‌ కాలువ ఆయకట్టులో యూరియాకు భారీగా డిమాండ్‌ ఉంటుందని ముందస్తుగానే అంచనా వేసిన ఎరువుల దుకాణ యజమానులు దానిని సొమ్ము చేసుకోవాలని చూశారు. దీనికి ముందస్తుగా ప్రణాళిక రచించారు. యూరియా అమ్మడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో యూరియా ఎమ్మార్పీకీ అమ్మలేమని, అసలు యూరియానే అమ్మబోమని ఏకంగా కోదాడలో ఎరువుల దుకాణదారులు తీర్మానం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ముందుగా యూరియా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని చూడడంతో ఎరువుల దుకాణాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి తమ వద్ద ఉన్న స్టాక్‌ను ఇప్పటికే అధిక ధరలకు విక్రయించారు. మరికొంత మంది నిల్వ లను బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలించారు.

అధికార యంత్రాంగాన్ని

కదిలించిన ‘సాక్షి’ కథనం..

కోదాడ, మునగాలకు చెందిన ఎరువుల దుకాణ యజమానులు యూరియా ఎమ్మార్పీకి అమ్మడం కుదరదని తీర్మానం చేయడంతో ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిని చూసి నేరేడుచర్లలో దుకాణదారులు కూడా ఇదే ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ‘ఎమ్మార్పీకి అమ్మలేం’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం కథనాన్ని ప్రచురితం చేసింది. అలాగే ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. సాక్షి కథనాన్ని చూసిన కలెక్టర్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి జిల్లా వ్యవసాయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద కోదాడకు వచ్చారు. స్థానిక దుకాణదారులను పిలిచి యూరియా అమ్మలేం అనే తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో పాటు సోమవారం నుంచి యథావిధిగా యూరియా అమ్మకాలు చేయాలని లేని పక్షంలో లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం దుకాణదారులతో కలిసి జిల్లా వ్యవసాయఅధికారి సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు.

రైతుల అవసరాలను సొమ్ముచేసుకోవాలనుకున్న ఎరువుల దుకాణదారులు

ఎమ్మార్పీకి యూరియా

అమ్మలేమని తీర్మానం

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

వ్యవసాయ అధికారులపై

కలెక్టర్‌ సీరియస్‌

ఎరువుల దుకాణదారులతో అధికారుల సమావేశం

వెనక్కి తగ్గిన ఎరువుల దుకాణదారులు

యూరియా అమ్ముతాం..

ఎమ్మార్పీకి యూరియా అమ్మితే తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పిన డీలర్లు ఆదివారం సాయంత్రం అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం రైతుల మీద తమకు ఎలాంటి కోపం లేదు.. యూరియా ఎమ్మార్పీకే అమ్ముతామని ప్రకటించడం గమనార్హం. కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతోనే ఎరువుల దుకాణ దారులు దిగి వచ్చారని పలువురు రైతులు అంటున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాల యజమానులతో కుమ్మకై ్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇక నుంచి ఎరువుల దుకాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement