
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 14న తిరుమలగిరికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులకు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వివి.అప్పారావు, డీపీఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్