
నిర్మాణ దశలోనే..
తిరుమలగిరి (తుంగతుర్తి) : అమృత్ 2.0 కింద 2 సంవత్సరాల క్రితం తిరుమలగిరి మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, నీటి సరఫరా, అంతర్గత పైప్‌లైన్ నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. 2024 మార్చిలో ఈ పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో మొత్తం 5 వాటర్ ట్యాంకుల నిర్మాణాలకుగాను ప్రస్తుతం మూడు ట్యాంకు నిర్మాణాలు ప్రారంభించారు. మున్సిపాలిటీలోని సంత ఆవరణలో, ప్రభుత్వ ఆస్పత్రి పక్కన, మోత్కూరు రోడ్డు పక్కన వాటర్ ట్యాంకు నిర్మాణాలను చేపట్టారు. సంతలో చేపట్టిన పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం 25 శాతం మేర పూర్తయ్యాయి. మిగతా రెండు చోట్లా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పైప్‌లైన్ నిర్మాణ పనులు ఎక్కడా చేపట్టలేదు.