దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు | - | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు

Jul 7 2025 6:46 AM | Updated on Jul 7 2025 6:46 AM

దేశవ్

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు

సూర్యాపేట అర్బన్‌ : ఈనెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెకు సీపీఐ మద్దతు ఉంటుందని ఆపార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను మార్చి 8 గంటల పని విధానాన్ని ఎత్తివేసి కార్మికుల సమ్మె హక్కును కాల రాసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్‌ లుగా మార్చటం సరికాదన్నారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సూర్యాపేట జిల్లా పార్టీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘ నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్‌, ఏఐవైఎఫ్‌ పట్టణ అధ్యక్షుడు బూర సైదులు పాల్గొన్నారు.

మద్యం మత్తులో

డ్రైవింగ్‌ చేయొద్దు

సూర్యాపేటటౌన్‌ : మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయొద్దని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1509 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో 15 మందికి జైలు శిక్షలు పడగా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల41వేలు జరిమానా కట్టినట్లు పేర్కొన్నారు. మద్యంతాగి వాహనాలు నడిపిన సూర్యాపేట డివిజన్‌ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్‌ పరిధిలో 552 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

జిల్లా ఆర్యవైశ్య క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా రాజా

తాళ్లగడ్డ (సూర్యాపేట) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా సూర్యాపేటకు చెందిన బండారు రాజా నియామకమయ్యారు. ఈమేరకు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్‌, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, మాజీ కార్యదర్శి గరినే శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

పీఆర్సీ అమలు చేయాలి

సూర్యాపేటటౌన్‌ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేస్తూ పీఆర్సీని అమలు చేయాలని టీపీటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మల శ్రీనివాస్‌, కడపర్తి శ్రీనివాస్‌ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీపీటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లతో పాటు జీరో సర్వీస్‌తో బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయ పోస్టు ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎనుగుతల రమేష్‌, రాష్ట్ర సహాధ్యక్షులు బచ్చుపల్లి శంకర్‌ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ముంత శ్రీనివాస్‌, బత్తుల ఉపేందర్‌, సోమగాని రమేష్‌, వీసావరం శ్రీనివాసరెడ్డి, బుర్రి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు 1
1/2

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు 2
2/2

దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement