
పోయిన ఫోన్లు దొరుకుతున్నయ్!
సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనుగోలు చేస్తే రశీదు తీసుకోవాలి
సెల్‌ఫోన్ పోయినా, ఎవరైన దొంగలించినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.ఆ పోర్టల్ ద్వారా మొబైల్‌ను బ్లాక్ చేస్తారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా సరిపోతుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తే షాపు యజమాని నుంచి రశీదు తీసుకోవాలి. దొంగలించిన ఫోన్ అని తెలిసి ఎవరైనా కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – కె.నరసింహ, ఎస్పీ
సూర్యాపేటటౌన్ : నిత్య జీవితంలో మొబైల్ ఫోన్ భాగమైపోయింది. ఎటు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా చేతిలో ఫోన్ లేనిదే జీవనం కొనసాగని పరిస్థితి. ప్రస్తుత సమాజంలో నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి సమాచారంతో పాటు బ్యాంక్‌కు సంబంధించిన వివరాలను ఫోన్‌లో భద్రపర్చుకుంటున్నాం. అలాంటి మొబైల్‌ఫోన్ ఎక్కడైనా పడిపోతే.. లేక ఎవరైనా దొంగిలిస్తే ఎలాంటి టెన్షన్ పడకుండా వెంటనే సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే చాలు. పోలీసులు వెతికి పట్టుకుని మీకు ఫోన్ అప్పగిస్తారు.
అందుబాటులోకి సీఈఐఆర్ పోర్టల్
మిస్సింగ్ ఫోన్లను రికవరీ చేసేందుకు కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ సీఈఐఆర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్‌లను ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా పోలీసులు గుర్తిస్తున్నారు.
ఇప్పటి వరకు 1,137 ఫిర్యాదులు
సూర్యాపేట జిల్లా పరిధిలో సీసీఎస్. ఐటీ సెల్ ఆధ్వర్యంలో మిస్సింగ్, చోరీకి గురైన మొబైల్స్‌ను రికవరీ చేసేందుకు స్పెషల్ టీంలు పని చేస్తున్నాయి. అంతేగాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో ఉన్న వివిధ స్టేషన్‌లలో మొబైల్స్ మిస్సింగ్, చోరీకి గురైనట్టు 1,137 ఫిర్యాదులు వచ్చాయి. అయితే వాటిలో ఇప్పటి వరకు 570 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పోలీసులు అందజేశారు.
ఫ సీఈఐఆర్ ద్వారా మిస్సింగ్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
ఫ ఇప్పటి వరకు జిల్లాలో
570 ఫోన్లు రికవరీ
ఫ యజమానులకు అప్పగింత

పోయిన ఫోన్లు దొరుకుతున్నయ్!