తుంగతుర్తి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తి మండల కేంద్రానికి వచ్చాయి. వాటిని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ జీఎస్ లత, ఎన్నికల అధికారులు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీఎస్ లత మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి 407 కంట్రోల్ యూనిట్లు, 407 బ్యాలెట్లు యూనిట్లు, 456 వీవీప్యాట్లు వచ్చాయని తెలిపారు. వాటిని వివిధ పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణారెడ్డి, సీఐ శ్రీను, ఎస్‌ఐ ఏడుకొండలు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.