వార్డుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు | Sakshi
Sakshi News home page

వార్డుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు

Published Thu, Mar 30 2023 2:20 AM

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ - Sakshi

సూర్యాపేట: ఎన్ని కౌన్సిల్‌ సమావేశాలు జరిగినా వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సూర్యాపేట మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌ రెడ్డి సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే విద్యుత్‌, రెవెన్యూ, వైద్య, ఆర్‌అండ్‌బీ, ఐసీడీఎస్‌, మిషన్‌ భగీరథ అధికారులను సమావేశానికి పిలిచామన్నారు. వేసవి దృష్ట్యా పట్టణంలో నీటి తాగునీటి సమస్య తలెత్త కుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ రామానుజులరెడ్డి తెలిపారు. 40 వ వార్డు కౌన్సిలర్‌ తాహెర్‌ మాట్లాడుతూ హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు పట్టణంలో షుగర్‌ వ్యాధి గ్రస్తులకు మందులతో పాటు ఉచితంగా ఇన్సులిన్‌ అందుబాటులో ఉంచాలన్నారు. 5వ వార్డ్‌ కౌన్సిలర్‌ బాషా మాట్లాడుతూ జాతర సమయంలో తమ వార్డులో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోయారని మళ్లీ శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్‌, ఎలిమినేటి అభినయ్‌, అంగిరేకుల రాజశ్రీ, జ్యోతి శ్రీవిద్య, అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్‌, బచ్చల కూరి శ్రీను, మాలోత్‌ కమల, వెలుగు వెంకన్న, భరత్‌, పలస మహాలక్ష్మి, జహీర్‌, పగిళ్ల సుమిలా రెడ్డి మాట్లాడుతూ తమ వార్డుల పరిధిలోని ఇళ్లపై 11 /33 కేవీ విద్యుత్‌ లైన్లు మార్చాలని, ట్రాన్స్‌ఫార్మర్లు షిఫ్ట్‌ చేయించాలని, లో ఓల్టేజీ సమస్యలను పరిష్కరించాలని, నూతన పోల్స్‌ వేయించి లైన్లు లాగాలని కోరారు. విద్యుత్‌ డీ ఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌ రెడ్డి, సీడీఎంఏతో మాట్లాడి సూర్యాపేట పట్టణంలో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి నూతనంగా పోల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకొచ్చారని, అవసరం గల ప్రాంతాలను గుర్తించి పోల్స్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే వాటిని పరిశీలించి మార్పిడి చేస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ఎంపిక కోసం వార్డుల వారీగా డ్రా తీయాలని కోరారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

ఫ పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్ల ఆవేదన

ఫ ఇళ్లపై నుంచి వెళ్లిన విద్యుత్‌ లైన్లు మార్చాలని డిమాండ్‌

ఫ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

ఫ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ

Advertisement
Advertisement