
రామోజీతండాలో వరిపొలాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
ఆత్మకూర్–ఎస్(సూర్యాపేట) : వరి పంట గింజ పోసుకుని గట్టిపడే దశలో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, కాండం తొలుచు పురుగు ఆశిస్తుందని వాటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఆదర్శ్, కిరణ్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని రామోజీతండా మండల వ్యవసాయ అధికారులతో కలిసి వరి పొలాలను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి దంతాల దివ్య, ఏఈఓ శైలజ, రైతులు గుగులోత్ వెంకన్న, కోట్య, రామ్మూర్తి ఉన్నారు.
ఆరుతడి వరిసాగుపై అవగాహన
చివ్వెంల(సూర్యాపేట) : నీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు ఆరుతడి పద్ధతిలో వరిసాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఏరియా మేనేజర్ రాచకొండ వీరస్వామి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రసూర్యాతండాలో సాగుపై రైతులకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.