‘మనబడి’ పనుల్లో వేగం పెంచాలి

కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ తదితరులు - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): మన ఊరు – మనబడి పథకం కింద జిల్లాలో ఎంపికై న పాఠశాలల్లో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మనఊరు–మనబడి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనవు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొదట విడతగా 329 పాఠశాలలు ఎంపికాగా అందులో 324 పాఠశాలలకు అనుమతులు వచ్చాయని, రూరల్‌ ఏరియాలో 279 అర్బన్‌ ఏరియాలో 50 పాఠశాలల్లో పనులు జరుతున్నాయని తెలిపారు.

46 పైలెట్‌ స్కూళ్లలో ఇప్పటికే 3 ప్రారంభించుకున్నామని మిగిలిన 43 పాఠశాలల పనులను మార్చి నెల 31 నాటికి పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇకపై పాఠశాల పనుల పరిశీలనకై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 102 గ్రామ పంచాయతీ భవనాల పనులు వెంటనే చేపట్టాలన్నారు. అనంతరం మండలాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్‌, డీఆర్‌డీఓ కిరణ్‌ కుమార్‌, డీఈ రమేష్‌, పీఆర్‌ ఇంజనీర్లు, ఏఈలు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
అనంతరం మండల విద్యాధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ..విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం అందజేయాలని సూచించారు. ఈసందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీఈఓతోపాటు ఏడీ శైలజ, ఎంఈఓలు పాల్గొన్నారు

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాం
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తామనికలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ జీఓలు 58, 59, 76 అమలు, పోడు భూములు, ఆయిల్‌ పామ్‌ సాగుపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాటిల్‌ హేమంత కేశవ్‌, డీఎఫ్‌ఓ సతీష్‌, ఆర్‌డీఓలు కోదాడ కిషోర్‌ కుమార్‌, హుజూర్‌నగర్‌ వెంకారెడ్డి, డీఎంహెచ్‌ఓ కోటాచలం, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రామారావు నాయక్‌, శ్రీధర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top