● ఇసుక అక్రమ తవ్వకాలపై తిరగబడుతున్న జనం
● వందల కోట్లు దోచుకుంటున్న అధికార పార్టీ నాయకుల తీరుపై ధ్వజం
● ఎక్కడికక్కడ ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్న పరిస్థితి
● రోడ్లు, ప్రజారోగ్యం దెబ్బతింటున్నాయని ఆవేదన
● ఇసుక వాహనాలకు అడ్డంగా నిలబడి నిరసనలు
జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన రేగిడి మండలం పెద్దపిర్లిలోని నాగావళి నదిలో మంగళవారం ఇసుక అక్రమంగా తవ్వేందుకు సిద్ధమవుతున్న యంత్రాలను మహిళలతో కలిసి స్థానికులు అడ్డుకుంటున్న దృశ్యం. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పంట పొలాలు, ప్రజలకు వరద రక్షణ కోసం కరకట్ట నిర్మిస్తే కూటమి ప్రభుత్వంలో దాన్ని తవ్వేసి ఇసుక తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల గ్రామానికి వరద ముప్పు ఉంటుందనే భయంతో తవ్వకాలకు ఉపయోగించే యంత్రాలను అడ్డుకున్నారు.
హిరమండలం మండలం భగీరథపురం వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను మంగళవారం అడ్డుకుంటున్న దృశ్యమిది. ఎక్కడికక్కడ భారీగా గోతులు పెట్టడంతో వరద నీరు పంట పొలాల్లోకి వచ్చేస్తుందన్న భయంతో ఆందోళనకు దిగారు. రోడ్లు పాడవుతున్నాయని, పెద్ద గొయ్యిలో పడి ప్రజలు చనిపోతున్నారని మండిపడ్డారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
సిక్కోలు జనం తిరగబడుతున్నారు. ఇసుకా సురుల అకృత్యాలను నడి రోడ్డుపైనే ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేసి పాలకుల తీరును తూర్పారపడుతున్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రజలు మండి పడుతున్నారు. ఇసుక అక్రమ సొమ్ము కోసం గ్రామాలను, రోడ్లను ధ్వంసం చేస్తుండటంపై ధ్వజమెత్తుతున్నారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దు రేగిడి మండలం వరకు ఇసుక అక్రమ తవ్వకాలపై ఎదురు తిరుగుతున్నా రు. నాగావళి, వంశధార, బాహుదా నదులను కబళించేసి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని తిరగబడుతున్నారు. రూ.వందల కోట్ల అక్రమార్జన కోసం నదులను గుల్ల చేయడమే కాకుండా రోడ్లు, వరద కట్లను పాడు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అధికార పార్టీ నాయకులు ఇసుకపై పడ్డారు. ఉచిత ఇసుక పేరుతో నదుల్లో ఇసుకను మింగేస్తున్నారు. ఇష్టారీతిన నదుల్లో రోడ్లు వేసేసి, నదుల్లోకి భారీ వాహనా లు పంపించి, భారీ యంత్రాలతో లోడింగ్ చేసి, గ్రామాల మీదుగా తరలిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ. 10వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నా రు. 30,40 టన్నుల లోడ్‌తో రవాణా చేస్తుండటం వలన రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నిత్యం ఇసుక లారీలు, ట్రక్కులు తిరుగుతుండటంతో దుమ్ము, ధూళి వెదజల్లి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గ్రా మాల్లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ ప్రమాదాలు చోటు చేసుకుని గ్రామాలు విలవిలలాడుతున్నాయి. నదుల్లోకి ఇసుక తరలించేందుకు కరకట్టలు తవ్వేసి రోడ్లు వేస్తుండటంతో వరదలకు గ్రామాలకు ముప్పు వాటిల్లుతోంది. పంట పొలాలు మునిగిపోయే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నదుల్లో భారీగా తీసిన గోతుల్లో పడి మరణాలు సంభవిస్తున్నాయి.
అధికార పార్టీ నాయకుల అక్రమ సొమ్ము కో సం గ్రామాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి, నదులు ధ్వంసమవుతున్నాయి. సమీప ప్రాంత ప్ర జలు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. నదుల్లో నీటి లభ్యత తగ్గిపోతోంది. మంచినీటి వనరులు దెబ్బతింటున్నాయి. తాగునీటి కోసం ఇబ్బందులు పడే దుస్థితి చోటు చేసుకుంది. వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. తవ్వకాలతో నదీ గమనం మారిపోయి ఎక్కడ కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి ఉంది.
శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చె ర్ల, పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో బరి తెగించి ఇసుక దోచుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బందులను మిగుల్చుతున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషిస్తున్నారు. మరికొన్నిచోట్ల వారి అనుచరులు దందా సాగిస్తున్నారు. మంత్రులు, పెదబాబు, చినబాబు పేరు చెప్పుకుని విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చి ఇసుక తవ్వి, సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామాలకు నష్టం
రోజురోజుకీ ఇసుక అక్రమ తవ్వకాలు శ్రుతిమించడం, అక్రమ రవాణాతో గ్రామాలకు నష్టం వాటిల్లడంతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. భరించలేని పరిస్థితులు వచ్చేశాయి. ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లే దుస్థితి ఏర్పడంతో ప్రజాగ్ర హం వెల్లువెత్తుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం ప్రజలు కాస్త భయపడే పరిస్థితి ఉండేది. బెదిరింపులు, దాడులు, కేసులతో మౌనంగా ఉన్నారు. అక్రమార్కులు ధనదాహం కోసం మరింత రెచ్చిపోతుండటంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కేసులు, దాడులకు భయపడమంటూ రోడ్డెక్కుతున్నారు. అక్రమాలపై తిరగబడుతున్నా రు. ఎక్కడికక్కడ ఇసుక లారీలు అడ్డుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు జరగడం లేదని, ఉచిత ఇసుక అందిస్తున్నామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నదంతా అబద్ధమని, కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యాలుగా జరుగుతున్న ఘటనలు నిలుస్తున్నాయి.


