మున్సిపల్‌ ఇంజినీర్‌ రవిశర్మ సరెండర్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఇంజినీర్‌ రవిశర్మ సరెండర్‌

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

శ్రీకాకుళం పీఎన్‌కాలనీ: శ్రీకాకుళం కార్పొరేషన్‌ మున్సిపల్‌ ఇంజినీర్‌ (ఎమ్‌ఈ) రవిశర్మ విధుల్లో అలసత్వం వహిస్తున్నారని ప్రభుత్వానికి సరెండర్‌ చేసినట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ హనుమంతు కూర్మారావు మంగళవారం తెలిపారు. కార్పొరేషన్‌లో అనేక అభివృద్ధి పనుల్లో పర్యవేక్షణ లోపం, పనుల్లో అలసత్వం వహించడం వల్లే సరెండర్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

మద్యం మత్తులో లారీ డ్రైవర్‌

రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడుతో లారీ వెళుతోంది. మంగళవారం మధ్యాహ్నం రణస్థలం సెంటర్‌లో హైవేపై లారీ ఆపి సమీపంలోని వైన్‌ షాప్‌కు వెళ్లి డ్రైవర్‌ మద్యం సేవించాడు. తిరిగి లారీ దగ్గర వచ్చినప్పటికే స్పృహ లేని స్థితిలో ఉన్నా డు. లారీ ఎక్కలేకపోవడం స్థానికులు గమనించి ఫుల్‌గా తాగి లారీ ఎందుకు ఎక్కుతున్నావని ప్రశ్నించగా తానే డ్రైవర్‌ను అని చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఓపిక లేని పరిస్థితిలో లారీ నడిపేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు నిలువరించి జేఆర్‌ పురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని స్టేషన్‌కు తరలించారు.

కిడిమికి తాగునీటి సరఫరా

సారవకోట: మండలంలో ని కిడిమి పంచాయతీ బుడితి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా మంగళవారం గ్రామస్తులకు తాగునీరు అందించారు. ఈ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం పనిచేయకపోవడంతో నెల రోజులుగా తాగు నీరు రాలేదు. దీనిపై ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎంపీడీఓ మోహన్‌ కుమార్‌ పంచాయతీ కార్యదర్శి తేజేశ్వరరావుకు తగిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో మోటార్‌ను మరమ్మతు చేయించి తాగునీటి సరఫరా చేపట్టారు.

ఐటీఐలో ప్రవేశాలకు వేళాయె

● దరఖాస్తులకు చివరి తేదీ జూన్‌ 30

● జూలై 2వ తేదీలోగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకోవాలి

● డీఎల్‌టీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.రఘురామ్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ఐటీఐ శిక్షణ సంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.రఘురామ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఐటీఐ.అడ్మిషన్స్‌.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌పోర్టల్‌లో జూన్‌ 30లోగా పూర్తిచేసుకోవాలని సూచించారు.

జూలై 2లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సమీపలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జూలై 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకోవాలని రఘురా మ్‌ కోరారు. టెన్త్‌క్లాస్‌, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, స్టడీ, ఆధార్‌కార్డు తదితర అన్ని ఒరి జినల్‌ ధ్రువీకరణ పత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఐటీఐ ప్రవేశాలకుగాను మొదటి విడతకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో జరుగుతుందని ఏడీ రఘురామ్‌ వెల్లడించారు. వివరాలు మొబైల్‌కే మెసేజీ రూపంలో వస్తాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement