పోలీస్‌స్టేషన్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ పరిశీలన

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

జి.సిగడాం: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. దీనిలో భాగంగా సిబ్బంది పనితీరు, స్టేషన్‌ నిర్వహణపై ఆరా తీశారు. గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసులు పక్కాగా గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తగాదాలు సృష్టించేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం డీఎస్సీ వివేకానంద, జేఆర్‌పురం సీఐ అవతారం, ఎస్‌ఐ సందీప్‌కుమార్‌లు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

హిరమండలం: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్‌ సెక్రటరీగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలానికి చెందిన మీసాల రజిని, ష్ట్ర రైతు విభాగం జాయింట్‌ సెక్రటరీగా సొర్లంగి గ్రామానికి చెందిన వంగపల్లి లక్ష్మినారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

మీసాల రజిని

లక్ష్మినారాయణ

Advertisement
 
Advertisement
Advertisement