వైఎస్సార్‌ సీపీపై తప్పుడు ప్రచారం తగదు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీపై తప్పుడు ప్రచారం తగదు

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

ఇచ్ఛాపురం: బాపు బొమ్మ స్పీక్స్‌ అనే ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతా ద్వారా ఫేక్‌ స్క్రీన్‌షాట్‌ సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నాయకులు పట్టణ పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రజల్లో అపోహలు కలిగించడానికి, రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలతో ప్రజాస్వామ్యం దెబ్బతినడమే కాక శాంతిభద్రతలకు ముప్పు కలిగే అవకాశముందన్నారు. ఇటువంటి ఫేక్‌ ఖాతాను సృష్టించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్‌, ఎంపీపీ బోర పుష్ప, మునిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, సల్లా దేవరాజు, పిలక సంతు, కారింగి మోహన్‌రావు, చిరంజీవి, సోషల్‌మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement